పట్టాల పండుగకు అందరం వెళ్దాం..
-కేటీఆర్ సభను విజయవంతం చేద్దాం
-టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్
KTR: 125 ఏండ్ల చరిత్రలో సింగరేణి ప్రాంతంలో పట్టాలు ఎవరూ ఇవ్వలేదని, ఇప్పుడు సింగరేణి కార్మికులు, బెల్లంపల్లి ప్రజలకు పట్టాలు ఇస్తున్న సందర్భంగా అందరం కలిసివెళ్దామని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోలేటీ సీహెచ్పీలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 8న నిర్వహించనున్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ప్రజలు పెద్దఎత్తున రావాలని కోరారు. సింగరేణి కార్మికులు యూనిఫాం, టోపీ ధరించి రావాలన్నారు. దుర్గం చిన్నయ్య కృషితో బెల్లంపల్లి వాసులకు పట్టాలు రావడం ఎంతో ఆనందమన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ చేస్తారన్నారు. ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ టీబీజీకేఎస్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంఘం ప్రకాష్ రావు, ఏరియా వర్క్ షాపు గొలేటిలో ఏరియా అసిస్టెంట్ కార్యదర్శి కుమారస్వామి తదితరులు సైతం కార్మికులను బహిరంగ సభకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శిలు మెరుగు రమేష్, కందుల తిరుపతి, కార్నాథం వెంకటేష్, సదాశివ్, గజెళ్ళి చంద్రశేఖర్, మారిన వెంకటేష్, భాస్కరాచారి, మైదం వీరస్వామి, మందనపు రామారావు సమీ తదితరులు పాల్గొన్నారు.