బ్రేకింగ్.. బెల్లంపల్లి లో ఫ్లెక్సీ ల కలకలం..

Flexis in Bellampally:మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బెల్లంపల్లిలో బీజీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ వైన్స్, రైతు వేదిక, ఆంజనేయునీ విగ్రహం వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. బై బై చిన్నయ్య పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరిజన్ డైరీ లో ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలు, భూ కబ్జాలు, సోమగూడెం టోల్ గేట్ సిబ్బంది పై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి ఇలా అన్నిటిని ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు. రాత్రి పూట పోలిసులు కొన్ని ఫ్లెక్సీ లు తొలగించారు.