రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ మృత్యువాత పడ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాంసి మండలం సర్పంచ్ పొన్నారి సర్పంచ్ చింతలపల్లి సంజీవ్ రెడ్డి పొన్నారి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వైపు వెళ్తున్నాడు. రూరల్ మండలంలోని రాంపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సర్పంచ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రిమ్స్ తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అలాగే మరో ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొన్నారి ఖోడత్ మధ్యలో లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలోనే ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.