పుట్టిన రోజు సందర్భంగా అల్పాహారం పంపిణీ
బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నేత, శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ఎండీ గెల్లి రమాకాంత్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం అందించారు. కాంటా ఏరియాలో 200 మంది దినసరి కూలీలు, బాటసారులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా గెల్లి రమాకాంత్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సతీష్, జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్, కార్యవర్గ సభ్యులు పాయవేని మల్లేష్, ఆడే సురేందర్, నిచ్చకొల గురుస్వామి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.