చెత్త ఎత్తిన కలెక్టర్
ఎక్కడ పడితే చెత్త వెయ్యద్దని చెప్పిన కలెక్టర్ స్వయంగా దానిని ఎత్తి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని అనంత పెట్ గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు అందరూ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వేయవద్దన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. చెరువు సమీపంలో చెత్త చెదారం పాలిథిన్ కవర్లను కలెక్టర్ స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.