సీఎం సభలో ఆందోళనలు : కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప్రసంగిస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తన పాత పట్టాదారు పుస్తకాన్ని చూపుతూ నిరసన తెలిపారు. కేసీఆర్ ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతూ అది చాలా మంచి నిర్ణయమని చెప్పారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ సమయంలో రైతు తన పట్టా పాసు పుస్తకాలు తీసుకుని ఆందోళన చేపట్టారు. ఇక కొందరు యువకులు సైతం ఉద్యోగాలు ఎక్కడా..? నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లు కొందరు ఉంటారని అతన్ని నా దగ్గరకు తీసుకురంటూ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.