గోదావరి నదికి సీఎం ప్రత్యేక హారతి
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. ఆయన శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పలు పథకాలు ప్రారంభించి, పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన బస్సులో రోడ్డు ద్వారా హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్న గోదావరి నది వద్ద ఆగి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. అనంతరం నదిలో నాణేలు వేశారు. ఇక్కడ నిత్యం నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయన తన వాహనాన్ని ఆపి మరీ నదికి హారతి ఇచ్చారు.