బీఆర్ఎస్ నేతల అరెస్ట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ BRS నేతలను అదపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. బెల్లంపల్లిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తాందూర్లో TRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్, కోటపల్లిలో TRSV రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ తో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ అరెస్టులు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.