తెగిన హైటెన్షన్ వైర్లు.. ముప్పు తప్పిన రైళ్లు…

Railways: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఎంతో మంది ప్రాణాలు పోయేవి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో 25వేల ఓల్టుల హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పట్టాల మీద పడ్డాయి. బెల్లంపల్లి-మందమర్రి రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. విషయాన్ని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బెల్లంపల్లిలో కోర్బా ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ దాదాపు 45 నిమిషాలు ఆపేశారు. దాదాపు నాలుగు గంటల పాటు రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. దానాపూర్, కాగజ్‌నగర్, అండమాన్ ఎక్స్ ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి. అధికారులు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో సాయంత్రం 5 గంటల నుంచి అన్ని రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.