బాసర ట్రిపుల్ ఐటీలో లో విద్యార్థిని అత్మహత్య
BASARA IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. పీయుసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంగరెడ్డి జిల్లాకి చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసింది. అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలికలు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు చూసేసరికి చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స చేసి, అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు దీపిక మృతి చెందినట్ల ధ్రువీకరించారు. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు,సిబ్బంది తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.