బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి మృతి

BASARA IIIT: ఆర్జీయూకేటీ బాసరలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం 4వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారి పడింది. భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అందించారు. అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు.

You might also like