13 మంది డీబార్.. ఇన్విజిలేటర్లపై చర్యలు..
Intermediate Examinations: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నకలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు ఒకే సెంటర్ నుంచి 13 మంది విద్యార్థులను డీబార్ చేయగా, ఇద్దరు ఇన్విజిలేటర్లపై చర్యలకు అదేశించారు. వివరాల్లోకి వెళితే… కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ స్వ్కాడ్ గా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో 13 మంది వద్ద నకలు చిట్టీల లభ్యమయ్యాయి. దీంతో 13 మంది విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. ఇందులో 12 మంది విద్యార్థులు, ఒకరు విద్యార్థిని. ఇద్దరు ఇన్విజిలేటర్లపై చర్యలకు ఆదేశించారు.