టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో శ‌నివారం ఉద‌యం అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య సరోజకు గాయాలయ్యాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసాగ‌ర్ రావు స‌తీమ‌ణి స‌రోజ శ‌నివారం తెల్ల‌వారుజామున ఇంట్లో పిండి వంట‌కాలు చేస్తుండ‌గా గ్యాస్ లీకై ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు గాయాలు అయ్యాయి. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. ప్రస్తుతం సరోజను చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like