మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద ఉద్రిక్తత
Clash between Congress and BRS classes
Clash between Congress and BRS classes: మాతా శిశు సంరక్షణా కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చేసుకుంది. పోలీసులు కలగచేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేయడంతో సమస్య సద్దుమణింది.
భారీగా వర్షాలు, వరదల నేపథ్యంలో మంచిర్యాల మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి ముందస్తుగా శుక్రవారం రోగులను తరలించారు. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకుని వారిని తరలించే ఏర్పాట్లు చేశారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు సైతం తరలింపులో పాల్గొన్నారు. అదే సమయంలో, అక్కడికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. వారు సైతం రోగులను తరలించే పని చేపట్టారు. ఈ సమయంలో రెండు వర్గాల నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.
ఒకానొకదశలో ఒకరిని ఒకరు తోసుకున్నారు కూడా. ఇరు పార్టీల నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇరు వర్గాలను శాంతింపచేశారు. అనంతరం రోగుల తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.