నాగోబా జాతర తేదీలివే..
Nagoba Jathara:నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతర తేదీలు ఖరారు చేశారు. నాగోబా జాతర, మహ పూజతో పాటు చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా,ఎస్పీ గౌస్ ఆలం, మెస్రం వంశీయుల సమావేశం అయ్యారు.కలెక్టర్ రాజర్షి షా వివరాలు వెల్లడించారు. రేపటి నుంచి ఏడు రోజుల పాటు ప్రచార రథంతో ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తరువాత గంగ నీళ్ల కోసం పాదయాత్ర చేస్తారు. ఈ నెల 28 నాగోబా మహాపూజ నిర్వహిస్తారు. ఇక 31న దర్బార్ నిర్వహించాలని మెస్రం వంశీయులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేస్లాపూర్లో నాగోబా జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.