మహారాష్ట్ర లో భారీ ఎన్ కౌంటర్…
ఏడుగురు మావోయిస్టులు మృతి
మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. భీకర కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కోర్చి పీయస్ పరిధి లో మావోయిస్టులు ఉన్నట్లు పక్క సమాచారం రావడంతో గడ్చిరోలి జిల్లా పోలీసులు… వారిపై దాడులు చేశారు. …. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఏడుగురు మావో యిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసుల కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరుగలేదు.