బీసీ సంక్షేమ హాస్టల్ అధికారిణి సస్పెన్షన్
![](https://naandinews.com/wp-content/uploads/2024/12/1734790569205-750x430.jpg)
BC welfare hostel officer suspended: బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని మృతికి కారణమైన హాస్టల్ అధికారిణినీ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే సస్పెండ్ చేస్తూ నిర్ణయిం తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హాస్టల్ అధికారిని నిఖత్ తరన్నుంను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు తున్న తొర్రం వెంకటలక్ష్మి (19) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. బెజ్జూర్ మండలం అందుగులపల్లికి చెందిన వెంకటలక్ష్మి అసిఫాబాద్ లోని శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో అడ్మిషన్ తీసుకుంది. డీఈడీ ప్రథమ సంవ త్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో వారం క్రితమే హాస్టల్కు వచ్చింది. అక్కడి భోజనం నచ్చకపోవడంతో ఎక్కువగా బయటి నుంచి పండ్లు తెచ్చుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. సిబ్బంది 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. అయితే వెంకటలక్ష్మి అనారోగ్యంతో ఉన్న విషయం తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిం చారు.