గణేషుడి చేతిలో లడ్డూ మాయం!
Laddu is lost in Ganesha’s hands: ఏకంగా గణేషుడి చేతిలో లడ్డూ మాయం చేశారు కొందరు వ్యక్తులు… రాత్రికి రాత్రే లడ్డూ మాయం కావడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు.కాగజ్ నగర్ మండలంలోని రాస్పెల్లి గ్రామపంచాయతీలోని గొర్రెగూడలోని ఓం శ్రీసాయి గణేశ్ మండలి వినాయక విగ్రహం వద్ద లడ్డూ శుక్రవారం మాయమైంది. నాలుగురోజుల పాటు పూజలు అందుకున్న లడ్డూ మాయమవడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. గురువారం రాత్రి గణేశ్ మండలి కమిటీ సభ్యులు మండపం వద్దే నిద్రించగా తెల్లవారు జామున లేచి చూసేసరికి లడ్డూ లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు.