చిన్నయ్య అనుచరుల దౌర్జన్యం
-హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై దాడి
-ట్యాబ్ లాక్కొని, ద్విచక్రవాహనం ధ్వంసం చేసిన వైనం
-కేసు నమోదు చేసిన పోలీసులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్నెపల్లి మండలం వీరాపూర్ లో ఎల్లాకుల మల్లయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశారు. తమ ఇంటికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి యత్నిస్తున్నారని, తమపై దాడికి పాల్పడుతున్నారని 100కు డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో బ్లూ కోర్టు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా, సర్పంచ్ జిల్లాల అశోక్, ఆయన కొడుకు మహేష్ కొందరు వ్యక్తులు కలిసి వారిపై దాడికి దిగి వాహనాన్ని ధ్వంసం చేశారు. అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ తులసి రాంలపై దాడి చేశారు. పోలీసుల ట్యాబ్ లాక్కొని, టూవీలర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు సెక్షన్ 353 ,188 ,రెడ్ with 34 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాము బాధితులతో మాట్లాడుతుండగా సర్పంచ్ అశోక్‌గౌడ్ అనుచరులు, కొడుకు మహేష్ తమపై దాడికి పాల్పడ్డారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. కింద పడేసి తొక్కారని వెల్లడించారు. పోలీసులు బిచ్చగాళ్లని, కుక్కలని ఇస్టం వచ్చినట్లు తిట్టారని చెప్పారు. మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరేం పీకలేరంటూ దాడికి పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి దయవల్ల కొందరు వ్యక్తులు వారిని ఆపడంతో తాము బయటపడ్డట్లు తెలిపారు.