స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
Marchfast of Central Forces: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని తాండూరు సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో కేంద్ర బలగాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజల్లో భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మీకు నచ్చిన వారికి ఓటేయాలని సీఐ పిలుపునిచ్చారు. పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మాదారం ఎస్ఐ అశోక్, తాండూరు ఎస్ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.