కడెం అన్ని గేట్లు ఎత్తివేత
Kadem project: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు అన్నీ గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. అధికారులు వెంటనే అప్రమత్తం అయి ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మొత్తం 18 గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్ లో మొదటిసారి 2లక్షల 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి కడెం ప్రాజెక్టు వద్ద కు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కడెం ప్రాజెక్టు వద్ద చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ , ఎస్ ఈ రవీందర్ ఎప్పటికప్పుడు వరద ఉధృతి అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. రాత్రి 12 గంటల వరకు 50 వేల క్యూసెక్కుల వరద ఉండగా, కేవలం గంటల వ్యవధి లోనే 2 లక్షల 30 వేల క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో మొత్తం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.