విద్యా భారతి పాఠశాలకు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డు

విద్య‌లో ప‌లు విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తున్న విద్యాభార‌తి విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. ఎడ్యుకేషన్ టుడే ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో డైనమిక్ స్కూల్ అవార్డ్స్ లో తాండూర్ విద్యాభారతి పాఠశాలకు 2024 సంవత్సరానికి డైనమిక్ స్కూల్ అవార్డు లభించింది. హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల డైరెక్టర్ శరత్ కుమార్ కు ఈ అవార్డు అందించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశవ్యప్తంగా 38 పాఠ‌శాలకు ఈ అవార్డు రాగా, జాతీయ స్థాయిలో పేరుపొందిన అనేక పాఠశాలల సరసన చేరి అవార్డు అందుకోవడం గర్వకారణమని ఆనందం వ్య‌క్తం చేశారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషకరమని, విద్యా భారతి ఎంచుకున్న విద్యా విధానాలు, టెక్నాలజీ తో కూడిన విద్యను గ్రామీణ ప్రాతాలకు విస్తరించిన అంశాలలో ఈ అవార్డు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, రవీంద్రభారతి స్కూల్స్, మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్, రాష్ట్రీయ సైనిక్ స్కూల్ బెంగళూరు, కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్, బెంగళూరు లాంటి ప్రముఖ విద్యా సంస్థలతో పాటు విద్యాభార‌తి పాఠ‌శాల‌కు ఈ అవార్డు ద‌క్క‌డం గ‌మ‌నార్హం. ఈ అవార్డు రావ‌డానికి ప‌రోక్షంగా సహకరించిన తల్లితండ్రులకు, సిబ్బందికి పాఠ‌శాల డైరెక్టర్ శరత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like