26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా మహారాష్ట్ర తరలిస్తున్న 26క్వింటాళ్ల రేషన్ బియ్యం, టాటా ట్రాలీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోటపల్లి మండలం రాంపూర్ కు చెందిన ధరణి సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వాహనాన్ని, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం రామకృష్ణపూర్ పోలీసులకు అప్పగించారు.