సంబురంగా అక్షరాభ్యాసాలు
అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ గర్భిణీలు, పిల్లలు ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కుశ్నపల్లి మీనా, గర్భిణీలు, పిల్లలు పాల్గొన్నారు.