దాడి చేసింది కుక్కలే
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయపల్లి వద్ద లేగదూడ పై దాడి చేసింది కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బుధవారం సాయంత్రం లేగదూడ పై ఓ జంతువు దాడి చేసిందని అది పులి అయి ఉండవచ్చు అని గ్రా భావించారు. అడవిలో నీలాయపల్లి వస్తున్న ఇద్దరు యువకులు రక్తం మరకలతో ఉన్న లేగదూడను చూసి పరుగులు తీశారు.
ఈ మధ్య కాలంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో పాటు చిరుతలు కూడా తిరుగుతుండటంతో అవి ఏవైనా దాడి చెసి ఉండవచ్చని భావించారు. ఈ రోజు ఉదయం డిప్యూటీ రేంజ్ అధికారి జాడి తిరుపతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దూడను ఆసుపత్రికి తరలించి పశువైద్యాధికారి ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. మండలంలో పులి సంచారం లేదని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.