200 మొబైల్ ఫోన్ల అప్పగింత
Ramagundam Police Commissionerate: రామగుండం కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగాలించిన సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా 200 ఫోన్లను బాధితులకు అప్పగించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను కమిషనర్ ఎం.శ్రీనివాస్ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దొంగతనం అయినా, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం సీసీఎస్‌తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5,280 సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా 1,538 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని యజమానులకు అందించినట్లు చెప్పారు. కొంతకాలంగా సీసీఎస్, ఐటి సెల్ పోలీసులు శ్రమించి రెండు వందల సెల్ ఫోన్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకునా, దొంగతనానికి గురైనా సీఆఐఆర్ పోర్టల్ (https://www.ceir.gov.in)లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు.
ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకం అయ్యిందన్నారు. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, దరఖాస్తు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్ పైనే ఆధారపడుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా, చోరికి గురైనా దానిని వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు. పోర్టల్‌లో ఎంటర్ చేసిన ఫోన్ వివరాలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా బ్లాక్ చేస్తుంది తెలిపారు. దీంతో ఆ ఫోన్ వాడటం కష్టమవుతుందని, ఈ విధానం వల్ల చోరీలు తగ్గే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా, ఫోన్లు తిరిగి పొందడం సులభమవుతుందన్నారు. ఈ సందర్భంగా తమ ఫోన్లు తిరిగి పొందినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాలలో ఈ సాయాన్ని చాలా విలువైనదిగా అభివర్ణించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ లు ఏ మధుసూదన్ రావు, నరేష్, జీవన్, చంద్రశేఖర్, శివకేశవులు, ఎన్ శ్రీధర్, బి భూమన్న, ఎన్. శామ్యూల్ పాల్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ దేవేందర్, ప్రేమ్ సింగ్, సత్తయ్య, హేమ సుందర్, దేవేందర్, కానిస్టేబుల్స్ రాజమౌళి, విష్ణు, సతీష్, జయచంద్ర, శ్రీనివాస్, భరత్, ఐటీ సెల్ కోఆర్డినేటర్ కో- ఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము, బి.రమేష్, వి.రాజేందర్ ను సీపీ అభినందించారు.