తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్
KCRL తెలంగాణకు ఎప్పుడైనా విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప.. ఏనాడు నోరు తెరిచి కొట్లాడలేదన్నారు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించాడు. ఇదే జిల్లాకు చెందిన ప్రయణ్ భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే.. అది నేరమైనట్లుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇష్టం లేకపోయినా తెలంగాణ ఇచ్చారు…
ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారు కాంగ్రెస్, జవహర్‌లాల్ నెహ్రూ అని దుయ్యబట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్భంలో 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వమని గుర్తు చేశారు. వాళ్లు చేసిన వేషాలు చూసి నేను.. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతుపట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేశారని చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకొని
తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయిన తెలంగాణ సృష్టించిన సుడిగాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన విషయం మీకు తెలుసన్నారు.