ఉగ్రదాడికి వ్యతిరేకంగా మంచిర్యాల బంద్
Manchiryala: జమ్మూ కాశ్మీర్ పహల్గాం(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ చేస్తున్న మంచిర్యాల కార్పొరేషన్లో బంద్ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల హిందూ ఐక్యవేదిక,ఛాంబర్ ఆఫ్ కామర్స్, కుల సంఘాలు,కార్మిక సంఘాలు,అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ బంద్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ సందర్బంగ పలువురు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించే వరకు భారత్ వెనకడుగు వేయవద్దని, భారతీయులు అంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.