బ్రేకింగ్.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. జిల్లా కేంద్రంలోని సిసిఐ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, గడ్డి మందు తాగి పడి ఉన్న వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారిని 108 లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వరం మండలం గడ్ చాంద్ కు చెందిన యువకుడు బలరాజ్, ప్రవళిక గా గుర్తించారు. యువతికి మూడు రోజుల కిందటే (గత నెల 30న) మరో యువకుడి తో వివాహం జరగడం గమనార్హం.
ప్రవళిక, బాలరాజ్వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల కిందట ప్రవళికకు బండల ఖానాపూర్ మండల్ పొనకల్ నివాసి నవీన్ తో పెళ్లి జరిగింది. పెండ్లి ఇష్టం లేకపోవడంతో బాలరాజ్ గౌడ్ తో ఇంట్లో నుండి పారిపోయి CCI దగ్గర ఇద్దరూ కలిసి గడ్డి మందు తాగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.