కాంగ్రెస్ నేత‌ల బాహాబాహీ

Congress: మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. రెండువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ చివ‌ర‌కు కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇదంతా ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల ముందే కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళితే.. సోమ‌వారం చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వ‌హించారు. మండల, బ్లాక్, డివిజన్‌, గ్రామ అధ్యక్షుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొన‌సాగాల్సి ఉంది. అయ‌తే, ఈ స‌మావేశంలో పీసీసీ స‌భ్యుడు రఘునాథరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజి రెడ్డి వర్గానికి మధ్య నెలకొన్న వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిద్ద‌రూ ఒకరిపై ఒక‌రు తోసుకున్నారు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప‌రిశీల‌కులుగా రాష్ట్ర ఆయిల్ & ఫెర్టిలైజర్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ రాంభూపాల్ హార‌జ‌య్యారు. వారి ముంద‌రే ఈ గొడ‌వ జ‌ర‌గ‌డంతో అధిష్టానం నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు ఏం చేయాలో అర్ధం కాలేదు. పోలీసులు గొడవకు యత్నించిన ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like