బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వ‌ర్క్‌షాప్‌..

BRS:బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వ‌ర్క్‌షాప్ న‌కు ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న (శనివారం) మల్లాపూర్ VNR గార్డెన్స్ లో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న కార్య‌క్ర‌మంలో మొద‌ట సెషన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పాల్గొని దిశానిర్దేశం చేయ‌నున్నారు. మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో కవి గాయకుడు, MLC దేశపతి శ్రీనివాస్ పాల్గొన‌నున్నారు. 3-4 గంటల సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సాయంత్రం 4 గంటల నుంచి కేటీఆర్ వర్క్ షాప్ లో పాల్గొని బీఆర్ఎస్వీ నాయకులకు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఈ వర్క్ షాప్ నేపథ్యంలో ఏర్పాట్ల‌ను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాల్కసుమ‌న్ ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like