రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యం క‌రెక్టే..

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీపై (BRS Party) ఎమ్మెల్సీ కవిత మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని.. అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై త‌న నిర్ణ‌యంపై బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని చెప్పారు. ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు.

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదని కవిత విమర్శించారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. కాగా తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కల్లో తాను గుర్తించడం లేదని కవిత పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like