అన్నయ్యా… హ్యాపీ బర్త్‌డే…
Kavitha Birth Day wishes to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అనాథ అశ్రమాలు, వృద్ధ అశ్రమాలల్లో అన్నదానం చేస్తున్నారు. మరికొందరు ఆసుపత్రల్లో పళ్లు పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
అయితే, కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తన సోదరుడు కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ ఆఫ్ ది డే’ అంటూ కవిత విషెస్ చెప్పారు. గతంలో వీరిద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వచ్చిన నేపథ్యంలో కవిత శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కవిత, కేటీఆర్‌కు మధ్య విబేధాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ దేవుడని.. చుట్టూ దయ్యాలు ఉన్నాయని, పార్టీలో కోవర్టులదే రాజ్యమంటూ కవిత కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు కేటీఆర్ ని ఉద్దేశించి చేశారని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ పరిణామంతో అప్పటి నుంచి కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.