గోలేటి ఓపెన్ కాస్ట్‌తోనే బెల్లంపల్లి ప్రాంతానికి భవిష్యత్తు

Singareni:గోలేటి ఓపెన్‌కాస్టు ఏర్పాటుకు సహకరించాల‌ని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు(Singareni Director (Projects & Planning) K. Venkateshwarlu) ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Asifabad MLA Kova Lakshmi)ని కోరారు. బెల్లంపల్లి ఏరియాలో పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో, కొత్తగా సంస్థ చేపట్టనున్న గోలేటి ఓపెన్ కాస్ట్ గనితో బెల్లంపల్లి ఏరియాకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంద‌న్నారు. ఈ గని ఏర్పాటుకు పూర్తి సహకారం అందించాల‌ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని సింగరేణి సంస్థ తరఫున విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా కంపెనీ విస్తరణ, భవిష్యత్తు కార్యక్రమాలను వివరించి సహకారం అందించాల‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like