దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకువ‌స్తున్న తుఫాన్‌

Cyclone Montha: ఆంధ్రాను అత‌లాకుత‌లం చేసిన మొంథా తుఫాన్(Cyclone Montha) తెలంగాణ వైపు దూసుకువ‌స్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటింది. ఇవాళ సాయంత్రం వాయుగుండంగా బలహీనపడనుంది. అదే స‌మ‌యంలో దిశ మార్చుకొని తెలంగాణ వైపు దూసుకొస్తోంది. తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన మొంథా తుపాన్.. భద్రాచలంకు ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు.. ఖమ్మంకు తూర్పున 110 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర – వాయువ్య దిశగా ప్రయణించి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాల‌కు ఫ్లాష్ ఫ్ల‌డ్స్‌..
మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి దిశ మార్చుకోవడంతో.. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ప్లాష్ ప్లడ్ ముప్పు ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్ జారీ చేసింది.

మంత్రి తుమ్మల ఆదేశాలు..
మొంథా తుఫాను తీరం దాటిన తురువాత తీవ్ర వాయుగుండంగా మారి దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడారు. రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు, కీలక ఆదేశాలు చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని తమ్మల ఆదేశించారు. రైతులు  తొందరపడి పంటలను అమ్ముకోవద్దని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని  సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను వాగులు వంకలు దాటకుండా చూడాలని, అందుకోసం పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని  సూచించారు. ఈ వర్ష ప్రభావంతో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా చెరువుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణగా ఉండాలని ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like