16న పిల్లల కోసం ప్రజావాణి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన (సాధారణ ప్రజావాణితో పాటు) ప్రత్యేకంగా “పిల్లల ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాలలకు సంబంధించిన వ్యక్తిగత, సామాజిక సమస్యలు, ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులను స్వీకరిస్తామ‌న్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో తెలియజేయవచ్చని వివరించారు.

You might also like