మాదారంలో పేకాట ఆడుతున్న మహిళల అరెస్ట్
Women arrested for playing poker: అవనిలో సగం… ఆకాశంలో సగం అని అంటూ ఉంటారు.. మనం వింటూనే వింటున్నాం.. ఆ మాటలు వంట పట్టించుకున్నారో ఏమో కానీ, ఎందులో తాము తక్కువ కాదనుకున్నారు.. అందుకే పేకాట మగవాళ్లే కాదు..తాము ఆడుతామని నిరూపించాలనుకున్నారు… వాళ్లు కూడా జూదం ఆడేందుకు సై అన్నారు.. అయితే పోలీసులు ఊరుకుంటారా..? పేకాట రాణులను అరెస్టు చేశారు.. ఇంతకీ పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళామణులు ఎక్కడి వారు..? ఏ జిల్లాలో జరిగింది…
పేకాట కేవలం మగవాళ్లే ఆడాలా… తాము కూడా ఆడతామని నిరూపించారు ఆ మహిళామణులు.. మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మాదారం గ్రామంలో పేకాట స్థావరం నడుస్తోందని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు పట్టుకున్నారు.
పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 5,150 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.