జాతీయ ర‌హ‌దారిపై ఆందోళ‌న‌

Road Accident:రోడ్డు ప్ర‌మాదంలో మృత్యువాత‌ప‌డిన వ్య‌క్తి కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరుతూ జాతీయ ర‌హ‌దారిపై మృతుని బంధువులు ఆందోళ‌న నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బ‌న వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఉదయం లహరి బస్సును బొలెరో వాహనం ఢీ కొట్టింది. దీంతో బొలెరో వాహ‌నం డ్రైవ‌ర్ విజ‌య్ కి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ధ్య‌లోనే మృత్యువాత ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు రైల్వే లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతి చెందిన బాధితుడికి న్యాయం చేయాలని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతుని బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ జాం అయ్యింది.

You might also like