న్యాయ‌వాదుల సంక్షేమ‌మే నా ధ్యేయం

Bar Council Elections:న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, వారి గౌరవానికి భంగం కలగకుండా సంస్థాగతమైన మార్పులు తీసుకువస్తానని సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్(Senior Advocate V. Raghunath) చెప్పారు. బార్ కౌన్సిల్ ఎన్నికల(Bar Council Elections) బరిలో నిలిచిన ఆయ‌న విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న నాంది న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వచ్చే వారికి మెరుగైన శిక్షణతో పాటు, వారికి ఆర్ధికంగా, వృత్తి ప‌రంగా అండగా ఉండేందుకు జ్యుడీషియల్ అకాడమీ ద్వారా ప్రత్యేక‌ సెమినార్లు నిర్వహిస్తామని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, ప్రతి న్యాయవాది కుటుంబానికి ఆరోగ్య భరోసా ఉండాలనని తన సంకల్పమన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జ‌రిపి మెరుగైన బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

న్యాయ‌వాదుల‌కు ప్ర‌త్యేక వెల్ఫేర్ ఫండ్ కోసం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మ‌హిళా న్యాయ‌వాదుల‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ కోసం కృషి చేస్తాన‌ని అన్నారు. దశాబ్దాల కాలంగా న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయ‌న ఎంతో మంది బాధితులకు న్యాయం అందించారు. మ‌రోవైపు న్యాయవాదుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ర‌ఘునాథ్‌. ఆయ‌న‌కున్న‌ అనుభవం, ఆయ‌న‌పై న‌మ్మ‌కం బార్ కౌన్సిలు కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప‌లువురు లాయ‌ర్లు స్ప‌ష్టం చేస్తున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా లాయ‌ర్ల మ‌ద్ద‌తు కూట‌గ‌ట్టేందుకు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. 107 సీరియ‌ల్‌ నంబ‌ర్ కు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసి గెలిపించాల‌ని రఘునాథ్ కోరారు.

You might also like