19న ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ‘ప్రజావాణి’కి సంబంధించి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీప‌క్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనులు, ఎన్నికల నిర్వహణ సంబంధించిన ఇతర విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యపడదని కలెక్టర్ తెలిపారు.

జనవరి 19న కలెక్టరేట్‌కు ఫిర్యాదులు ఇచ్చేందుకు రావాలని భావించిన ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. ఈ నిర్ణయానికి జిల్లా ప్రజలు సహకరించాలని, అధికారుల పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సమన్వయం పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like