రోడ్డు ప్ర‌మాదంలో మృతులు వీరే…

Road Accident:నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెలుతున్న లారీని, నిజామాబాద్ వైపు నుంచి భైంసాకి వ‌స్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో న‌లుగురు మ‌ర‌ణించారు. మరొకరు పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

న‌లుగురు మృత్యువాత‌..
కుభీర్ మండలం కుప్టి సర్పంచ్ గంగాధర్ తో పాటు మరో ఐదుగురు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న గ్రామస్తుడిని పరామర్శించేందుకు వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు సుద్దవాగు వంతెన పై ఎదురుగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీకి తగిలిన కారు కుడి వైపు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కుబీర్ మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ వికాస్ బొప్ప, మధ్య‌లో కూర్చున్న భోజరాం పాటిల్, వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్న అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. సర్పంచ్ గంగాధర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భైంసా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి అక్క‌డి నుంచి నిజామాబాద్ తరలించారు.

దారుణంగా ప్ర‌మాద దృశ్యాలు..
ప్రమాద సమాచారం అందుకున్న బైంసా ఏఏస్పీ రాజేష్ మీనా, సీఐ సాయి కుమార్ ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. ప్రమాదం కారణంగా బోయిడి బాబన్న శరీరం నుంచి తల భాగం తెగిపోయి వాహనం నుంచి బయట పడిపోయింది. ఇక డ్రైవింగ్ సీట్ నుంచి కింది భాగంలో పడిపోయిన డ్రైవర్ వికాస్ బొప్ప, డోరు ఊడిపోయి రోడ్డుపై పడిపోయిన భోజరామ్ పాటిల్ మృతదేహాలను ట్రాలీ ఆటోలో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పైనున్న రెండు వాహనాలను జేసీబీ ద్వారా తొలగించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like