సింగర్ సీతక్క..
వారం రోజుల్లో దేశంలోనే రెండవ అతిపెద్ద కుంభమేళా, మేడారం సమ్మక్క సారక్క (SAMMAKKA SARAKKKA) జాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అభివృద్ధికి బ్జెట్ కేటాయించి చకచకా పనులు పైతం కొనసాగిస్తున్నారు. అయితే జాతర ఈ నెల 29న ప్రారంభం కానుండగా ప్రజలు ఇప్పటి నుంచే తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు ఇప్పటినుంచే పయనమవుతున్నారు. దీంతో పది రోజులు ముందే పండగ వాతావరణం వచ్చేసింది.
మేడారం జాతర వైభవాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క స్వయంగా ఓ పాట పాడారు. రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క, మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటలో సమ్మక్క-సారలమ్మ మహిమలు, గిరిజనుల ఆరాధన విధానం, అడవుల్లోని ఆధ్యాత్మిక వాతావరణం సహజంగా ప్రతిబింబించాయి. డప్పుల మోగుడు, జానపద రాగాలు, సంప్రదాయ నృత్యాలు పాటకు ప్రాణం పోశాయి. సీతక్క మేడారం పాటను పాడటం ఇదేం తొలిసారి కాదు. 2022లో, గతేడాది కూడా ఆమె పాట పాడారు. ఇక ఈ ఏడాది మిలిమిల మెరిసిందగో మేడారం జాతర అంటూ పాటను ఎత్తుకున్నారు. కళకళలాడిందిగా గిరిజనుల జాతర అంటూ తన స్వర మాధుర్యాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు.