ఈసారి కేటీఆర్‌కు సిట్ నోటీసులు

KTR: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగపత్రం దాఖలు చేయగా, విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.

కేటీఆర్ కి సిట్ నోటీసులు నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకి కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లోనే ఉండి హరీశ్ రావు మానిటరింగ్ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా రెండు రోజుల కింద‌ట మాజీ మంత్రి హరీశ్ రావును అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. “ఉద్యమాలు మాకు కొత్త కాదు, మీలాగా పారిపోలేదు. ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారు” అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హరీశ్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్‌కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like