మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేక రైళ్లు

Special Trains For Medaram Jathara : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 01వ తేదీ వ‌ర‌కు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్, నిజామాబాద్‌-వ‌రంగ‌ల్‌ మార్గంలో నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఉపయోగపడనున్నాయి.

సికింద్రాబాద్‌-మంచిర్యాల‌-సికింద్రాబాద్‌ (07495/07496), నిజామాబాద్‌-వరంగల్-సికింద్రాబాద్ మధ్య (07499/07500) కాజిపేట‌-ఖ‌మ్మం-కాజీపేట‌ (07504/07503), సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్-సికింద్రాబాద్‌-సిర్పూర్ కాగ‌జ్ న‌గ‌ర్(07497/07498), ఆదిలాబాద్‌-కాజీపేట‌-ఆదిలాబాద్‌(07501/07502) ళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యం కోసం రైళ్ల శాఖ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

గతంలో ప్రత్యేక రైళ్లకు మంచి ఆదరణే వ‌చ్చింది. 2024 జాతరలో దక్షిణ మధ్య రైల్వే పలు జన సాధారణ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఖమ్మం-వరంగల్, సికింద్రాబాద్‌-వరంగల్, నిజామాబాద్‌-వరంగల్‌ వయా సికింద్రాబాద్, కాగజ్‌నగర్‌-వరంగల్‌ మధ్య మేడారం జాతర కోసమని నడిపిన ప్రత్యేక రైళ్లు భక్తులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 2016, 2018, 2022 జాతరల సందర్భంగా భక్తులు ప్రత్యేక రైలు సేవలు వినియోగించుకున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి ఉన్నప్పుడు 2020లో ప్రత్యేక రైళ్లు నడవలేదు.

You might also like