రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
Road Accident:తాండూరు మండంలోని ఐబీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. దీంతో సాయి అనే యువకుడికి బలమైన గాయాలు కాగా, రాజేష్ అనే యువకుడికి సైతం దెబ్బలు తాకాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.