తాండూర్ లో సీనియర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల సీనియర్ క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. దాదాపుగా 20 ఏళ్ల కింద‌ట‌ వరకు క్రికెట్ ఆడిన మండలంలోని క్రీడాకారులందరూ కలిసి వెటరన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పేరుతో పోటీలు నిర్వహించారు. 40 ఏళ్లు దాటిన ఆటగాళ్లు సుమారు 60 మంది 4 జట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. తాండూర్ సర్కిల్ కార్యాలయం మైదానంలో ఆదివారం ఈ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. మండలానికి చెందిన పలువురు నాయకులు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించగా సోమవారం ఫైనల్ పోరు నిర్వహించనున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. మండలంలోని పలువురు సీనియర్ క్రికెట్ అభిమానుల ఆలోచనతో ఈ పోటీల ద్వారా పూర్వ క్రికెట్ ఆటగాళ్లను కలిపేలా టోర్నమెంట్ ఏర్పాటు చేయగా.. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న అప్పటి ఆటగాళ్లు కూడా వచ్చి పోటీల్లో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like