మున్సిపల్ ఎన్నికల నగారా..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలు వెల్లడించారు. రేపట్నుంచి మున్సిపల్ నామినేషన్లు షురూ కానుండగా, నామినేషన్లకు జనవరి 30వ తేదీ చివరి గడువు విధించారు. రాష్ట్రంలో 52లక్షల 43 వేల మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికలకు సంబంధించిన ముఖ్య తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జనవరి 27, 2026
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం జనవరి 28, 2026
నామినేషన్లకు చివరి గడువు జనవరి 30, 2026
నామినేషన్ల పరిశీలన (Scrutiny) జనవరి 31, 2026
పోలింగ్ తేదీ ఫిబ్రవరి 11, 2026
ఫలితాల వెల్లడి ఫిబ్రవరి 13, 2026
పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తి పన్ను (Property Tax) ఇతర మున్సిపల్ బకాయిలు చెల్లించినట్లు ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది.