బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు..
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, మంత్రి జోక్యంతో ఆ వ్యవహారం కాస్తా ఆలస్యం అయ్యింది. అయితే, కాంగ్రెస పార్టీతో కలిసి నడిస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన సీపీఐ ఆ పార్టీకి దూరం అవుతోంది. ఈ నేపథ్యంలోనే క్యాతన్‌పల్లిలో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
తమ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రకటించారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఉన్నారు. ఈ నెల మూడవ తేదీన పార్టీల వారీగా సీట్ల ఖరారు చేయనున్నారు. ఇరు పార్టీలు కలిసి సమన్వయతో పనిచేసి క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలతో సింగరేణి ఉనికే ప్రమాదంలో పడుతోందని నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. పదుల సంఖ్యలో స్కాముల ద్వారా సింగరేణి బొంద పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.