సికాస గ‌డ్డ ఇది..

HarishRao:ఇది సికాస గ‌డ్డ అని… ఇక్క‌డ బెదిరింపులు ప‌నిచేయ‌వ‌ని… ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ర‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు అన్నారు. కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి స్కాంలకు నిలయంగా మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు ఆరోపించారు. క్యాత‌న్‌ప‌ల్లిలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో వేలు పెట్టలేదన్నారు. కోల్ ఇండియాకు ఆదర్శంగా సింగరేణి ఉండేదన్నారు. ఈ సింగ‌రేణిని దేశం మెచ్చుకున్నది, ప్రపంచం మెచ్చుకున్నదన్నారు. బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందని స్ప‌ష్టం చేశారు. మొత్తం ఆరువేల కోట్ల స్కాం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

విచార‌ణ ఎందుకు చేయ‌రు..?
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి ప్లస్ 20 శాతానికి టెండర్లు ఇచ్చారని అన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరపరు, ఎందుకు సిట్టింగ్ జడ్జి విచారణ జరుపర‌ని ప్ర‌శ్నించారు. ఎందుకు సిబిఐ విచారణ చేయ‌ని అన్నారు. శ్రీరాంపూర్ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్స్ టెండర్ ఏడు సార్లు తేదీలు మార్చారని.. లెక్కలు కుదరడం లేదని వాయిదా వేసారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డీజిల్ స్కాం, జిలిటెన్ స్టిక్స్ స్కాం, నైనీ కోల్ స్కాం, సోలార్ పవర్ స్కాం… ఇలా సింగ‌రేణిలో అన్ని స్కాంలేనంటూ దుయ్య‌బ‌ట్టారు.

బంగారు బాతును కోసుకుతింటున్నరు
వాళ్ల‌ను వ‌దిలేస్తే ఐదు, పదేండ్లలో సింగరేణిని ఖతం చేస్తారని, బంగారు బాతును కోసుకుతింటున్నర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేసీఆర్ హయాంలో పునరుద్ధరించిన డిపెండెంట్ ఉద్యోగాలను, మెడికల్ బోర్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం “బోగస్” చేసిందని విమర్శించారు. నిమ్స్ మినహా ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు బంద్, డిపెండెంట్ ఉద్యోగాలు బంద్ చేసిండని రేవంత్ రెడ్డిపై దుయ్య‌బ‌ట్టారు. నడవలేని వారిని, గుండెకు బై పాస్ సర్జరీ చేసుకున్న వాళ్లను అన్ ఫిట్ చేయడం లేదన్నారు.

మంత్రి వివేక్ మౌనంపై ప్రశ్నలు
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి సింగరేణిలో జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. “ఈ స్కాంలలో మీకు కూడా వాటా ఉందా?” అని నిలదీశారు. సింగ‌రేణిలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై కార్మిక మంత్రిగా ఉన్నడు వివేక్… కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడడు అంటూ నిల‌దీశారు. అన్యాయం జరిగితే, స్కాంలు జరుగుతుంటే ఎందుకు వివేక్ నోరు విప్పరంటూ ప్ర‌శ్నించారు. మహిళలు & వృద్ధులు: నెలకు రూ. 2,500 ఇస్తామని మహిళలను, పెన్షన్ల విషయంలో వృద్ధులను ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, కానీ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి వచ్చినా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు.

వారికి ధ‌న్య‌వాదాలు..
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో బీఆర్ఎస్‌తో చేతులు కలిపిన సీపీఐ (AITUC) నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డి అహంకారాన్ని అణచాలని పిలుపునిచ్చారు. స్కాంల గురించి అడిగితే డైవర్షన్స్కీంలు అడిగితే డైవర్షన్.. బిడ్డా రేవంత్ రెడ్డి నిన్ను కూడా తెలంగాణ ప్రజలు డైవర్షన్ పెడుతరంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చీరి చింత‌కు క‌ట్టండి..
మున్సిపల్ ఎన్నికల్లో రేవంతును చీరి చింతకు కట్టాలని హ‌రీష్ రావు పిలుపునిచ్చారు. కారు మీద గుద్దే గుద్దుడుకు రేవంతు గూబ గొయ్యి మనాల‌ని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకుంటే నీ మొఖానికి ముఖ్యమంత్రి అయితవా..? కేసీఆర్ గురించి ఆయన గురించి మాట్లాడుతున్న భాషను ప్ర‌జ‌లు ఒప్పుకుంటరా..? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? అంటూ దుయ్య‌బ‌ట్టారు. మంచిర్యాల జిల్లా కల సాకారం చేసింది కేసీఆర్ అని హ‌రీష్‌రావు గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ ఇచ్చాడ‌ని, చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేశాడ‌న్నారు. క్యాతన్ పల్లి కోసం 200 కోట్లు మంజూరు చేసినం. క్యాతన్ పల్లి ఫ్లై ఓవర్ కట్టినమ‌న్నారు. బాల్క సుమన్ ఎంతో అభివృద్ధి చేశాడని, ఈ రెండేళ్లలో ఒక్క పని అయినా అయ్యిందా? అని అంటూ హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like