క‌విత‌కు క్లీన్‌చిట్‌

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు ఊరట లభించింది. కవితపై సీబీఐ (CBI) నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. కవితపై సీబీఐ ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. CBI సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు (lacunae) ఉన్నాయని, వాటికి సాక్షులు… స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు (prima facie case) కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

ఈ కేసులో క‌విత‌కు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సీబీఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదల అయిన విష‌యం తెలిసిందే.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like